న్యూఢిల్లీ : కాఫీ విత్ కరణ్ షోకు తనకు ఎందుకు పిలుపు రాలేదో నటి తాప్సీ చెప్పుకొచ్చింది. తన సెక్స్ లైఫ్ ఆసక్తికరంగా ఉండకపోవడంతోనే తనను కాఫీ విత్ కరణ్ తాజా సీజన్‌కు పిలవకపోవడానికి కారణం అయి ఉండవచ్చని తాప్సీ పేర్కొంది. తన మూవీ దుబారా ప్రమోషన్స్‌లో భాగంగా విలేకరులు కరణ్ షో గురించి ప్రశ్నించగా ఆమె ఇలా బదులిచ్చింది.
జులై 1 నుంచి ప్రారంభమైన సీజన్ 7లో సినీ పరిశ్రమ నుంచి అనన్యా పాండే, విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, సారా అలిఖాన్, కరీనా కపూర్, అమీర్ కాన్ వంటి దిగ్గజాలు కరణ్‌తో ముచ్చటిస్తూ సంచలన విషయాలు పంచుకున్నారు. కాఫీ విత్ కరణ్ 7 న్యూ ఎపిసోడ్స్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రతి గురువారం ప్రసారమవుతాయి.
ఇక తాప్సీ లేటెస్ట్ మూవీ దుబారాను అనురాగ్ కశ్యప్ తెరకెక్కించగా, శోభాకపూర్, ఏక్తాకపూర్ నిర్మాణ సంస్ధ కల్ట్ మూవీస్ నిర్మించింది. ఆగస్ట్ 19న ఈ మూవీ దేశవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.