ప్రియుడి సాంగత్యంలో..

హిందీ చిత్రసీమలో మహిళా ప్రధాన కథాంశాల్ని ఎంచుకొని సత్తా చాటుతోంది సీనియర్ కథానాయిక తాప్సీ. అదే సమయంలో వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిపూర్ణంగా ఆస్వాదిస్తోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథిస్బోతో ఈ సుందరి గత కొన్నేళ్లుగా ప్రేమాయణాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే తమ బంధం గురించి తాప్సీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. వివిధ సందర్భాల్లో ఈ జంట కలిసి తీయించుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో తన లవ్‌ఎఫైర్ గురించి తాప్సీ చెప్పకనే చెబుతోందని అభిమానులు నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించే తాను పెళ్లాడుతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పడంతో ఆమె పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. సోమవారం బాయ్‌ఫ్రెండ్ మాథిస్బో జన్మదినం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి విందులో పాల్గొన్న ఓ ఫొటోను తాప్సీ సోదరి షగుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో మాథిస్బోతో కలిసి తాప్సీ చిరునవ్వులు చిందిస్తోంది. ‘నాకెంతో ఇష్టమైన వ్యక్తుల సాంగత్యాన్ని ఆస్వాదిస్తున్నా’ అంటూ ఈ ఫొటోపై మాథిస్యే వ్యాఖ్యానించారు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందని తాప్సీ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇటీవలే ‘హసీనా దిల్రుబా’ చిత్రంతో తాప్సీ ప్రేక్షకులముందుకొచ్చింది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- mathias boe
- Taapsee Pannu
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

