హీరో నిఖిల్ నటించబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియో నిర్మించనుంది. యుద్ధ నేపథ్యంలో వినూత్న కథాంశంతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన వియత్నాంలో నెలరోజుల పాటు కఠినమైన శిక్షణకు సిద్ధమవుతున్నారు.
పలు రకాలైన ఆయుధాలను ఉపయోగించడం మొదలుకొని మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో నిఖిల్ శిక్షణ తీసుకోనున్నారు. ‘ప్రముఖ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో నిఖిల్ ట్రైనింగ్ జరుగుతుంది. ఆయన కెరీర్లోనే ఛాలెజింగ్ రోల్ ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: భువన్, శ్రీకర్.