Nikhil Siddartha | టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాగా, ఇప్పుడు ఈ చిత్రం మ్యూజికల్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది చిత్రయూనిట్. ఇందులో భాగంగా ఈ సినిమాలోని మొదటి పాట ‘రా రా ధీవర’ (Ra Ra Dheevara)పాటకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫుల్ పాటను ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఒక యోధుడి స్ఫూర్తిని చాటిచెప్పే విధంగా సాగే ఈ గీతం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ వేసవిలో ‘స్వయంభూ’ వెండితెరపై భారీ స్థాయిలో సందడి చేయనుంది.
6:03 PM Today… 💥
Get ready to be blown away by the grand, thumping First Single From Swayambhu ⚔️🔥Here’s a sneak peek into the epic warrior world.#SwayambhuFirstSingle Promo #RaRaDheevara is OUT NOW ❤️🔥
A @RaviBasrur Musical 🎶
Singer: @santoshvenky
Lyricist: @ramjowrites… pic.twitter.com/d1oAjNyd9d— BA Raju’s Team (@baraju_SuperHit) April 16, 2026