గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న సినిమా ‘స్వాతి ముత్యం’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. బెర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ మాట్లాడుతూ…‘జీవితం, ప్రేమ, పెళ్లి వంటి విషయాల పట్ల స్వాతి ముత్యం లాంటి ఓ యువకుడి ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా సాగాయి అనేది సినిమాలో చూపిస్తున్నాం.