Sushanth Singh movie in China | చైనాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమా
సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలీవుడ్ (Bollywood) నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushanth Singh Rajput) అర్థాంతరంగా సినీ ప్రేమికులను వదిలివెళ్లిపోయాడు. సుశాంత్ సింగ్ నటించిన చిత్రాల్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకునేది చిచోరే (Chhichhore).

ఎంఎస్ ధోనీ, కేదార్ నాథ్, చిచోరే (Chhichhore), దిల్ బెచారా లాంటి చిత్రాలతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు దివంగత బాలీవుడ్ (Bollywood) నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushanth Singh Rajput). సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ యువ నటుడు అర్థాంతరంగా సినీ ప్రేమికులను వదిలివెళ్లిపోయాడు. అయితే సుశాంత్ సింగ్ భౌతికంగా లేకున్నా అతడు నటించిన సినిమాలు మాత్రం జనాల్లో సజీవంగా ఉండిపోతాయి. సుశాంత్ సింగ్ నటించిన చిత్రాల్లో ప్రత్యేకమైనదిగా చెప్పుకునేది చిచోరే.
హీరోగా, టీం మెంబర్‌గా, మాజీ భర్తగా డిఫరెంట్ షేడ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుశాంత్. రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామి సృష్టించింది. తాజాగా ఈ చిత్రం అరుదైన ఫీట్ అందుకోబోతుంది. 2019లో విడుదలై కోట్లాది మంది మనస్సు గెలుచుకున్న చిచోరే చిత్రం చైనా (China Theatres) లో కూడా గ్రాండ్‌గా విడుదల కానుంది. 2022 జనవరి 7న చైనాలో గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం.
నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన చిచోరే జనవరిలో చైనాలోని 100కుపై పట్టణాల్లో 11వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుండటం విశేషం. చిచోరే చిత్రంలో శ్రద్దాకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా..టాలీవుడ్ నటుడు నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర పోషించాడు. మన మధ్య భౌతికంగా లేకపోయినా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎలా ఉందో చెప్పేందుకు ఇదో చక్కటి ఉదాహరణ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Brahmastra release date | నాగార్జున బాలీవుడ్ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
Radhika Apte | మహిళలకు మహిళలే శత్రువులా … ఉపాసన, రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!
Hyderabad | హైదరాబాద్‌లో అర్ధరాత్రి రెచ్చిపోతున్న మందుబాబులు.. గాల్లో దీపంగా అమాయకుల ప్రాణాలు!
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

