జైలర్-2 అంచనాల్ని నిలబెట్టింది
‘సూపర్స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్పై ఉన్న నమ్మకంతో ‘జైలర్-2’ హక్కులను కొనుగోలు చేశాం.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాల్ని సాధిస్తున్నది. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం చాలా అరుదు. కానీ ఈ సినిమా విషయంలో వారందరూ సంతోషంగా ఉన్నారు’ అని చెప్పారు అగ్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘జైలర్-2’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ర్టాల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగవంశీ మాట్లాడారు. ‘జైలర్-2’ విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయని, విడుదలైన అన్ని కేంద్రాల్లో మొదటి షో నుంచే భారీ వసూళ్లు సాధిస్తున్నదని ఆనందం వ్యక్తం చేశారు. విజయదశమి రోజున బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పడతామనే నమ్మకం ఉందని ఈ చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసిన మైత్రి శశి తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

