Suriya42 | హిందీలో సూర్య సినిమాకు కోట్లలో బిజినెస్.. షూటింగ్ పూర్తి కాకుండానే వంద కోట్ల డీల్..!
గత కొంత కాలంగా సూర్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయాలు మూటగట్టుకుంటున్నాయి. సింగం-2 తర్వాత ఇప్పటివరకు సూర్యకు ఆ స్థాయి హిట్టు లేదు. గతేడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈటీ మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా మిగిలింది.
Suriya42 | తమిళ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. సూపర్ స్టార్ రజిని, లోకనాయకుడు కమల్ తర్వాత ఆ స్థాయిలో సూర్య తెలుగులో క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా సూర్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. నిజానికి సింగం-2 తర్వాత ఇప్పటివరకు సూర్యకు ఆ స్థాయి హిట్టు లేదు. గతేడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఈటీ’ మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం సూర్య ఆశలన్నీ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ సినిమా పైనే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం సూర్య గ్రాఫ్ ఎలా ఉన్నా ఈ సినిమాకు మాత్రం భారీ రేంజ్లో బిజినెస్ జరుగుతుందట. హిందీలో ఈ సినిమా థియేట్రికల్-నాన్ థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.100 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ రేంజ్లో సూర్య సినిమాకు హిందీ బిజినెస్ జరగడం విశేషం అనే చెప్పాలి.
ఈ సినిమా సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన మోషన్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని పది భాషల్లో ౩డీలో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

