Suriya 47 | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, ‘ప్రేమలు’ ఫేమ్ మలయాళ యువ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది ఒక విభిన్నమైన యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుండగా, ఇందులో సూర్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ ప్రముఖ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఈ సినిమాకు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, దీపావళి కానుకగా నవంబర్ 6, 2026న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.