Suriya42 | సూర్య భారీ బడ్జెట్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. అభిమానులు సంతృప్తి చెందుతారా?
టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న తమిళ నటుడు సూర్య. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు సూర్య దగ్గరయ్యాడు. ‘శివ పుత్రుడు’, ‘యువ’ వంటి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరైన సూర్య.
Suriya42 Movie | టాలీవుడ్ హీరోలకు సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న తమిళ నటుడు సూర్య. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు సూర్య దగ్గరయ్యాడు. ‘శివ పుత్రుడు’, ‘యువ’ వంటి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరైన సూర్య.. ‘గజిని’ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో తెలుగులో ఈయనకు విపరీతమైన క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సూర్య42’ ఒకటి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు వీర్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాక్. ఇటీవలే ఈ పేరును నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తుంది. అయితే ఈ టైటిల్‌పై అభిమానులు సంతృప్తిగా లేరిని టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 10 భాషల్లో 3డీలో రూపొందుతుంది. యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సూర్యకు జోడీగ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

