ఫొటో స్టూడియోలో ఏం జరిగింది?
చైతన్య రావ్, లావణ్య జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మిస్తున్నారు.
చైతన్య రావ్, లావణ్య జంటగా నటిస్తున్న సినిమా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మిస్తున్నారు. చెందు ముద్దు దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ…‘80వ దశకంలో ఓ గ్రామ నేపథ్యంగా సాగే చిత్రమిది. ఆ కాలంలోని గ్రామ వాతావరణాన్ని మా చిత్రం ప్రతిబింబిస్తుంది. ఫన్‌తో పాటు క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఫస్ట్ కాపీ చూశాక పూర్తి సంతృప్తిగా ఉన్నాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ…‘స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. ఒక ప్రత్యేక చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మిహిర, ఉత్తర, వైవా రాఘవ్ తదితరులు నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

