Surapanam kick and fun Teaser | థ్రిల్‌తోపాటు వినోదం..’సురాపానం కిక్ అండ్ ఫన్’ టీజర్
సురాపానం (కిక్ అండ్ ఫన్) (Surapanam kick and fun). ఈ సినిమా టీజర్‌ను (Surapanam Official Teaser) ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర గురువారం సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేశారు.
అఖిల్ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై సంపత్ కుమార్ (Sampath Kumar) దర్శకత్వం వహిస్తూ..నటించిన చిత్రం సురాపానం ( కిక్ అండ్ ఫన్) (Surapanam kick and fun). ఈ సినిమా టీజర్‌ను (Surapanam Official Teaser) ప్రముఖ దర్శకుడు సాగర్ కె చంద్ర గురువారం సాయంత్రం 6 గంటలకు లాంఛ్ చేశారు. ఈ సందర్బంగా సాగర్ కె చంద్ర మాట్లాడుతూ..సురాపానం..కిక్ అండ్ ఫన్ టైటిల్‌కు తగ్గట్టుగా టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుని, మంచి థ్రిల్ తో పాటు వినోదాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. సురాపానం ( కిక్ అండ్ ఫన్ ) సినిమా ఫాంటసీ థ్రిల్లర్ . కంప్లీట్ కామెడి ఎంటర్టైనర్ అని తెలిపారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై మొదటి సారిగా సరికొత్త కథాంశంతో వస్తున్న సురాపానం సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సార్ లో ఉన్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
సంపత్ కుమార్ , ప్రగ్యా నయన్ (Pragya Nayan) ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించగా.. ప్రధాన పాత్రలలో అజయ్ ఘోష్ , సూర్య , ఫిష్ వెంకట్ , మీసాల లక్ష్మణ్ , చమ్మక్ చంద్ర , సురభి ప్రభావతి , త్రిపుర తదితరులు నటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్ట మధు యాదవ్, మట్ట రాజు యాదవ్, సంపత్ కుమార్ తో పాటు నటుడు మీసాల లక్ష్మణ్ , విద్యాసాగర్ , గిరి పోతరాజు, ప్రణయ్ వంగరి తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

