Rajinikanth | తమిళనాట సూపర్ స్టార్‌గా పేరొందిన నటుడు రజినీకాంత్.. గత 50 ఏండ్లుగా దక్షిణాది సినిమా ప్రేక్షకులకు తెలియని వారు ఉండరు. వివిధ సినిమాల్లో అద్భుతమైన నటనకు రజనీకాంత్‌కు అవార్డులు కొత్త కాదు.. కానీ, ఈ దఫా భిన్నమైన అవార్డు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం పన్ను చెల్లింపుదారుగా రజనీకాంత్ నిలిచారు. అందుకు గౌరవంగా ఆయనకు ఆదాయం పన్ను విభాగం అధికారులు అవార్డు ప్రదానం చేశారు.
ఆదాయం పన్ను దినోత్సవం ( Income Tax Day ) సందర్భంగా చెన్నైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి తెలంగాణ-పుదుచ్చేరి గవర్నర్ తమిళసై అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌తోపాటు పలువురు ప్రముఖులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. అయితే, రజనీకాంత్ తరపున ఆయన తనయ ఐశ్వర్యా రజినీకాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఇతర పన్ను చెల్లింపు దారులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్నాథ్ భండారీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ నిర్మించనున్న `జైలర్` సినిమా షూటింగ్‌కు తయారైందుకు తలైవార్బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, శివకార్తికేయన్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, రమ్యకృష్ణ తదితరులు నటిస్తారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ, తారాగణంపై అధికారిక ప్రకటన రాలేదు.