Mahesh Babu | హోటల్ బిజినెస్‌లోకి మహేశ్..?
Mahesh Babu | సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన పేరుమీదున్న ఏఎంబీ సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్‌లలో ఒకటి.
Mahesh Babu | సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే మహేశ్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన పేరుమీదున్న ఏఎంబీ సినిమాస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్‌లలో ఒకటి. ఇక మహేశ్ కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే కాకుండా టెక్స్టైల్స్ బిజినెస్‌లోనూ అడుగుపెట్టారు. మహేశ్‌కు సంబంధించిన అన్ని వ్యాపారాలను ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ చూసుకుంటుంటారు.
తాజా సమాచారం ప్రకారం.. మహేశ్‌బాబు హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. తన భార్య నమ్రత పేరుతో ఈ హోటల్‌ను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. మినర్వ గ్రూప్‌తో కలిసి మినర్వా -ఏఎన్ (ఏఎన్-ఏషియన్ నమ్రతా) పేరుతో బంజారాహిల్స్‌లో రెస్టారెంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. త్వరలోనే ఈ బిజినెస్‌పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. మహేశ్ 28వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. ఇటీవల తన తల్లి ఇందిరాదేవి మరణంతో మహేశ్ రెండో షెడ్యూల్‌కు కాస్త విరామం తీసుకున్నారు. ఈ సినిమాలో మహేశ్ సరసన పూజా హెగ్దే నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు, నాగ వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

