Sudheer babu | కృష్ణగారు మా ఇద్దరి సినిమాలు మాత్రమే చూస్తానన్నారు : సుధీర్ బాబు
మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ హంట్ (Hunt). శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో హంట్ జనవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు టీం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
టాలీవుడ్ యాక్టర్ సుధీర్‌బాబు (sudheerbabu) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ హంట్ (Hunt). మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో హంట్ జనవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు టీం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ప్రెస్ మీట్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ.. కృష్ణగారు మనల్ని వదిలివెళ్లిన తర్వాత విడుదలవుతున్న నా తొలి సినిమా ఇది. సినిమా విడుదలయ్యాక ఫస్ట్ షో అయిన తర్వాత ఆయన నుంచి మొదటి ఫోన్ కాల్ వస్తది. నేనది మిస్సవుతున్నా. మొదట నేను సినిమాల్లోకి వస్తాను అని చెప్పినపుడు అందరికీ అయోమయం. కానీ కృష్ణగారు కష్టపడితే సక్సెస్ అవుతాడు చేయనివ్వండి అని అన్నారు. అప్పటి నుంచి నా లైఫ్ తీసుకోవడమే కాదు.. మంచి గౌరవం, విలువ దక్కింది.
కృష్ణగారు చనిపోయేకంటే సుమారు 30 రోజుల ముందు ప్రతీ శుక్రవారం కొత్త సినిమా విడుదలవుతుంటాయి కదా.. ఏదైనా సినిమా చూస్తారా..? అని ఆయనను ఇంట్లోవాళ్లు అడిగారు. నేనెవరి సినిమాలు చూడనమ్మా. మహేశ్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామనుకుంటున్నానన్నారు. అప్పుడు నేను నమ్మలేదు. వందల సినిమాలు చేసిన సూపర్ స్టార్ మూడు గంటలు సౌకర్యవంతంగా చూసే పరిస్థితి లేకున్నా కొన్ని సినిమాలు మాత్రమే చూద్దామని ఎంచుకున్నారు. అందులో నా సినిమా ఎంపిక చేసుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనిది.
నా లైఫ్‌లో ఎంత దూరం వెళ్తానో తెలియదు.. ఈ పయనం మాత్రం మామయ్య గారికే అంకితం. శ్రీకాంత్, భరత్ లేకపోతే హంట్ సినిమా పూర్తవదు. డైరెక్టర్ ఈ సినిమా విడుదలయ్యాక నా కన్నా పెద్ద హీరోలతో సినిమా చేసే అవకాశాలు వస్తాయని గట్టిగా నమ్ముతానంటూ చెప్పుకొచ్చాడు.
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ స్టిల్స్ ..
Team #HuntTheMovie from the Pre-Release Press meet 💥
All set for the Grand Release on 26th January 🔥🔥#HuntFrom26Jan@isudheerbabu @bharathhere @actorsrikanth @Imaheshh @ChitraShuklaOff @BhavyaCreations @vincentcinema @shreyasgroup pic.twitter.com/EJnHKAig8U
— BA Raju's Team (@baraju_SuperHit) January 23, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

