డేరింగ్ అండ్ డాషింగ్ హీరో… ఎందుకంటే ?
Superstar Krishna: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రేమ పిపాసి హీరో కృష్ణ ఇవాళ కన్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచిన లవ్లీ స్టార్ కృష్ణకు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న నిక్‌నేమ్ ఉంది. సుమారు 350కు పైగా చిత్రాల్లో చేసి
హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రేమ పిపాసి హీరో కృష్ణ ఇవాళ కన్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచిన లవ్లీ స్టార్ కృష్ణకు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న నిక్‌నేమ్ ఉంది. సుమారు 350కు పైగా చిత్రాల్లో చేసిన కృష్ణ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశారు. 60వ దశాబ్ధం నుంచి చిత్రరంగంలో ఉన్న ఆయన .. ఆధునిక టెక్నాలజీ పట్ల ఎక్కువ మక్కువ చూపారు.
తెలుగు ఇండస్ట్రీకి సినిమాస్కోప్ను పరిచయం చేసింది కృష్ణే. సూపర్ హిట్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని సినిమాస్కోప్ టెక్నాలజీతో తీశారు. 70ఎంఎం స్క్రీన్‌పై విడుదలైన తొలి చిత్రం సింహాసనం. ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసింది కూడా సూపర్‌స్టార్ కృష్ణనే. తెలుగు చిత్రాల్లో కౌబాయ్ పాత్రను పరిచయం చేసింది కూడా ఈయనే. మోసగాళ్లకు మోసగాడు చిత్రం కౌబాయ్ చిత్రాల్లో ఫేమస్ హిట్.
అనేక యాక్షన్ చిత్రాల్లో హీరో కృష్ణ నటించారు. జేమ్స్ బాండ్ పాత్రలను కూడా తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది కృష్ణే. గూఢాచారి 116 ఫిల్మ్ ఓ హైలెట్. ఆ సినిమా ఇండస్ట్రీలో కృష్ణ ఇమేజ్‌నే మార్చేసింది. ఆ తర్వాత అదే వరుసలో ఏజెంట్ గోపి, జేమ్స్ బాండ్ 777 సినిమాలు తీశాడు. కృష్ణ ఫ్యాన్స్ ఆయన్ను తెలుగు జేమ్స్ బాండ్గానే గుర్తిస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన ప్రయోగాలకు ఆయన్ను డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలుస్తారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

