కరోనా వలన చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్తో రూపొందిన చిత్రాలు కూడా రిలీజ్ చేయలేక వాయిదా వేసుకున్నాయి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో, 21 సెంచరీ ఫాక్స్ ఐఎన్సీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న అవతార్ 2 చిత్రం కరనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ డేట్స్ ప్రకటించింది డిస్నీ.
అవతార్ 2 సినిమాను 2022 డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. ఈ మేరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనౌన్స్ తేదీనీ ప్రకటించింది. ఇవే కాకుండా థోర్ మే 6వ తేదిన విడుదల కానుండగా, బ్లాక్ ఫాంథర్ జూలై 8వ తేదిన, బ్లేడ్ అక్టోబర్ 7 వ తేది, ది మార్వెల్స్ నవంబర్ 11వ తేదిన విడుదల కానున్నాయి.డిస్నీ విడుదల చేయనున్న సినిమాల లిస్ట్ చూస్తే..
2021
• ది లాస్ట్ డ్యూయల్ – 22nd October
• గోనే రాంగ్ – 29th October
• ఎటర్నల్స్ – 5th November
• ఎన్కాంటో – 26th November
• వెస్ట్ సైడ్ స్టోరీ – 10th December
• ది కింగ్స్ మ్యాన్ – 24th December
2022
• డెత్ ఆన్ ది నెయిల్ – 11th February
• టర్నింగ్ రెడ్ – 11th March
• మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ – 25th March
• లవ్ అండ్ థండర్ – 6th May
• లైట్ ఇయర్ -17th June
• బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్ – 8th July
• బ్లేడ్ – 7th October
• ది మార్వెల్స్ – 11th November
• అవతార్ 2 – 16th December