ఆద్యంతం నవ్వించే ‘సూపర్ సుబ్బు’
కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘సూపర్ సుబ్బు’. సందీప్‌కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు.
కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘సూపర్ సుబ్బు’. సందీప్‌కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఓ అమాయక యువకుడు..అత్యంత సంప్రదాయ గ్రామం..అసాధ్యమైన ఓ ఉద్యోగం’ అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ వీడియో గ్లింప్స్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.
సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు అనే యువకుడు ప్రజల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో మాకిపూర్ అనే గ్రామంలోకి అడుగుపెడతాడు. అక్కడ అతనికి అనుకోని వింత పరిస్థితులు ఎదురవుతాయి. ఈ క్రమంలో అతను తన ప్రేమ, కుటుంబం, కెరీర్‌ను పణంగా పెట్టాల్సివస్తుంది. ఈ నేపథ్యంలో అతను తీసుకున్న నిర్ణయమేమిటన్నది ఈ కథలో ఆసక్తికరమని ఈ సిరీస్ క్రియేటర్, దర్శకుడు మల్లిక్‌రామ్ తెలిపారు. బ్రహ్మానందం, మురళీశర్మ, సంపూర్ణేష్‌బాబు ఈ సిరీస్‌లో కీలక పాత్రల్ని పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

