Super Star Krishna | 50ఏళ్ళ క్రితమే.. సూపర్ స్టార్ కృష్ణ పాన్ వరల్డ్ సినిమా..!
Mosagallaku Mosagadu | ఇప్పుడు మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ చెప్పుకుంటున్నాం.. కానీ సూపర్ స్టార్ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్ వరల్డ్ సినిమా తీసి టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
Mosagallaku Mosagadu | ఇప్పుడు మనం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ సూపర్ స్టార్ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్ వరల్డ్ సినిమా తీసి టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాడు. కృష్ణ హీరోగా కే.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఫర్ ఏ ఫ్యూ డాల్లర్స్’ మోర్ వంటి ఇంగ్లీష్ సినిమాలు అప్పట్లో మద్రాస్‌లో మంచి కలెక్షన్లు సాధించాయి. దాంతో కృష్ణ మనం కూడా ఇలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారని భావించాడు. అనుకున్నదే తడువుగా రచయిత ఆరుద్ర గారిని పిలిచి తెలుగు నేటీవిటీకి తగ్గట్లు కథ రాయమని చెప్పారు. ‘ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ’ అనే హాలీవుడ్ మూవీ ఇన్సిరేషన్తో ఆరుద్ర ఈ సినిమా కథను రాశారు.
ఈ చిత్రాన్ని కృష్ణ తన సొంత బ్యానర్ అయిన పద్మాలయ స్టూడీయోస్‌పై నిర్మించాడు. అప్పట్లోనే ఈ చిత్రానికి రూ.8 లక్షల బడ్జెట్ అయింది. మొదట ఈ సినిమాకు అదృష్ట రేఖ అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే ఈ సినిమాకు ఆ పేరు అంతగా బాగాలేదని అనుకుని మోసగాళ్ళకు మోసగాడు అనే పేరును పెట్టారు. 1971 ఆగస్టు 27లో తొలి తెలుగు కౌబాయ్ చిత్రంగా రిలీజైన ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం 50లక్షల గ్రాస్‌ను కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత 50లక్షల గ్రాస్ సాధించి మూడో హీరోగా కృష్ణ నిలిచాడు. ఈ చిత్రం తమిళంలో ‘మొసక్కరనుక్కు మొసక్కరన్’, హిందీలో ‘గన్‌ఫైటర్ జానీ’ పేరుతో రిలీజైంది. ఇక్కడ ఈ సినిమాకు అనూహ్య స్పందన రావడంతో, కృష్ణ ఈ సినిమా నిడివిని తగ్గించి ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో ఇంగ్లీష్ వెర్షన్లో రిలీజ్ చేశాడు. అక్కడ కూడా ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ఇలా తెలుగు నుండి ఇంగ్లీష్‌కు డబ్ అయిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

