Sunny Leone | సన్నీ లియోన్ కిచెన్‌లో విష పురుగులు.. చూసి షాక్ అవుతున్న నెటిజన్స్
Sunny Leone | ఒకప్పుడు శృంగార తారగా యువతకి బాగా పరిచయం ఉన్న సన్నీ లియోన్, ఇప్పుడు బాలీవుడ్లో ఓ ప్రముఖ నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్ కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక సన్నీ లియోన్‌గా మార్చుకుంది.
Sunny Leone | ఒకప్పుడు శృంగార తారగా యువతకి బాగా పరిచయం ఉన్న సన్నీ లియోన్, ఇప్పుడు బాలీవుడ్లో ఓ ప్రముఖ నటిగా, డ్యాన్సర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జిత్ కౌర్ కాగా ఇండస్ట్రీలోకి వచ్చాక సన్నీ లియోన్‌గా మార్చుకుంది. భారత మూలాలు ఉన్న సన్నీ లియోన్.. 2012లో ‘జిస్మ్ 2’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసింది. మొదట అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అనంతరం 2013లో నటించిన ‘జాక్‌పాట్’ కూడా నిరాశపరిచింది. కానీ 2014లో వచ్చిన ‘రాగిణి MMS 2’ హర్రర్ చిత్రంతో బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ఆమెకు కొంత గుర్తింపు తీసుకొచ్చినా, నటిగా స్థిరపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఈ సమయంలో సన్నీ ఐటెం సాంగ్స్ చేయడం ప్రారంభించింది. ఆమె చేసిన కొన్ని పాటలు యువతను బాగా ఆకర్షించాయి. తన 12 ఏళ్ల సినీ కెరీర్లో సన్నీ దాదాపు 40 సినిమాల్లో నటించిందైనా, చాలా చిత్రాల్లో ఆమె పాత్రలు పరిమితమైనవే. అడల్ట్ చిత్రాల్లో తనతో కలిసి నటించిన డేనియల్ వెబర్‌ను సన్నీ 2011లో పెళ్లాడింది. దశాబ్దకాలంగా తమ వైవాహిక జీవితం కొనసాగిస్తున్న ఈ జంటకి ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ ఉన్నారు. నిషాను ఈ దంపతులు దత్తత తీసుకున్నారు. నటిగా కాకుండా, డ్యాన్సర్‌గా కూడా మంచి డిమాండ్ ఉన్న సన్నీ, ఒక్కో ఐటెం సాంగ్‌కి రూ. 3 కోట్లు వరకు తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె దక్షిణాది సినిమాల్లో కూడా కొన్ని ప్రాజెక్టుల్లో నటించింది.
కెరీర్ ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, తన ప్రత్యేక శైలితో తనదైన స్థానం సంపాదించుకున్న సన్నీ లియోన్ ఇప్పుడు ఓ రోల్ మోడల్‌గా కూడా మారింది. సన్నీ లియోన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా తన కిచెన్‌లో టమోటో కోస్తున్నప్పుడు అందులో నుండి విష పురుగులు బయటకు వచ్చాయని తెలిపింది. తనకు ఎదురైన సమస్యల నేపథ్యంలో అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ సూచలను చేసింది. ప్రస్తుతం సన్నీ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

