బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్(Sunny Leone).. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరవనున్నది. తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి ఆమె ఇప్పటికే ఫ్రెంచ్ సిటీకి చేరుకున్నది. కెన్నడీ చిత్రం కోసం ఆమె బుధవారం ప్రమోషన్ చేయనున్నది. గ్రీన్ గౌన్ వేసుకున్న సన్నీ లియోన్.. కేన్స్‌లో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. కేన్స్ నగరానికి ఆదివారం చేరుకున్న ఆ బ్యూటీ ప్రస్తుతం ఇంటర్వ్యూల్లో బిజీగా ఉంది. సన్నీ పోస్టు చేసిన ఫోటోలకు అభిమానులు కామెంట్లతో లైక్ కొట్టేస్తున్నారు.
కెన్నడీ చిత్ర ప్రమోషన్ కోసం వచ్చిన సన్నీ లియోన్.. అక్కడ రెడ్‌కార్పెట్‌లో దర్శనమివ్వనున్నది. రెడ్‌కార్పెట్‌పై పాల్గొనడం కొంత టెన్షన్ పుట్టిస్తోందని ఆ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. రెడ్‌కార్పెట్‌లో సన్నీ ఎలా మెరుస్తుందో ఇక వేచి చూడడమే మన వంతు.