sunny: సన్నీ.. మీ స్వప్ప సుందరి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నా: బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో సోమవారం రోజు శ్రీరామ్, మానస్‌ల వీడియోలు ప్లే చేసిన బిగ్ బాస్ మంగళవారం రోజు షణ్ముఖ్, సన్నీల వీడియోలు చూపించాడు. తన తల్లితో ఉన్న ఫొటోని తీసుకుని ‘కళావతి అడక్క అడక్క ఓ గిఫ్ట్ అడిగావ్.. కప్పు తీసుకుని రా అని.. నేను ట్రై చేస్తున్నా.. మిగతాది జనాల చేతిలో ఉంది.. నా కోసం ప్రార్ధన చేయి అని చెప్పాడు సన్నీ. అయితే బిగ్ బాస్ ప్లే చేసిన వీడియోలో ‘సరదా సన్నీ ఒకే అక్షరంతో మొదలౌతాయని.. మీరు గుర్తు చేశారు.
ఈ ఇంట్లో మీరు బంధాలు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా అందరి మొహంపైనవ్వు తీసుకుని వచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు.. వాళ్లు మిమ్మల్ని ఇష్టపడినా లేకున్నా.. మీలోని స్నేహితుడు వాళ్లని పరిచయం చేశాడు.. మీలోని కోపం మీకు ఇబ్బందులు తీసుకుని వచ్చి.. అందరి ముందు దోషిగా నిలబెట్టిన క్షణాలు.. మీ మనసుని గాయం చేసిన విషయాన్ని బిగ్ బాస్ గమనించారు.
ప్రతి టాస్క్‌లో గెలవాలనే మీ తపన.. గెలిచేవరకూ పోరాడే పట్టుదల.. మీ ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. ఒంటరిగా వచ్చిన మనిషికి కొంచెం ప్రేమను సంపాదించుకోవడం కంటే పెద్ద విజయం ఏదీ లేదని మీరు సాధించిన విజయమే మీకు గుర్తు చేస్తుంది. మీరు వెతుకున్న స్వప్న సుందరి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నా.. అప్నా టైం ఆయేగా.. అన్న మీ మాట మిమ్మల్ని ప్రేమించే వారికి గట్టిగా వినిపించింది. సన్నీ మీ సమయం వచ్చేసింది’ అంటూ సన్నీ జర్నీని చూపించారు బిగ్ బాస్. మీ మనసుకి దగ్గరైన ఒక ఫొటోగ్రాఫ్‌ని మీతో తీసుకుని వెళ్లండని బిగ్ బాస్ చెప్పడంతో.. తన తల్లితో ఉన్న ఫొటోతో పాటు.. మానస్‌తో ఉన్న ఫొటోని కూడా తీసుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

