Gadar-2 Movie | ఎప్పుడో సోలో హీరోగా మార్కెట్ కోల్పోయిన ఒక హీరో ఊహకందని రేంజ్లో స్టార్ హీరోల సినిమాలను దాటేస్తాడంటే గదర్-2 ముందు వరకు అవి వట్టి మాటలే అనిపించేవి. కానీ గదర్-2 సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం బాలీవుడ్ ట్రేడ్‌ను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న సిన్నీ డియోలో ఈ రేంజ్లో హిట్టు కొడతాడని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఇప్పటికే ఎన్నో ఏరియాల్లో ఖాన్ల, కపూర్ల రికార్డులను బద్దలు కొడుతూ బాలీవుడ్‌నాట సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.380 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. మంగళవారంతో రూ.400 కోట్ల క్లబ్లో అడుగుపెట్టడం పక్కా.
ఇరవైఏళ్ల కింద బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన ఆల్ టైమ్ క్లాసిక్ గదర్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో హిందీ బాక్సాఫీస్ దగ్గర సన్నీ డియోల్ చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. దీని జోరు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ సీక్వెల్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి సన్నీ డియోల్ మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని పలు వార్తలు వచ్చారు. రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్లాన్‌లో సన్నీ ఉన్నట్లు బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. అయితే తాజాగా వీటిపై సన్నీ స్పందించాడు. తను బోర్డర్ సినిమాకు సీక్వెల్ చేయట్లేదేని క్లారిటీ ఇచ్చాడు.
జే.పి దత్తా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ వార్ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇండో-పాకిస్థాన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా సైనికుల పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు దత్తా ఈ సినిమా కథపై దాదాపు రెండేళ్లు కూర్చున్నాడట. ఇక రిలీజ్‌కు ముందే పాటలు ఓ రేంజ్లో జనాల చెవులలో మార్మోగిపోయాయి. స్టోరీ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ సమపాల్లలో కుదిరి ఆల్‌టైమ్ సూపర్ హిట్ సినిమాగా అప్పట్లో నిలిచింది.