Suniel Shetty | భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. గత వారం వీరి వివాహం సునీల్ శెట్టి నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొత్త జంట ఇప్పటికే అభిమానులతో పంచుకున్నారు. కాగా, సంగీత్ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను అథియా శెట్టి తాజాగా అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో సునీల్ శెట్టి.. తన కుమార్తె అతియాతో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఫొటో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
జనవరి 23వ తేదీన ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాలలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రాహుల్, అథియా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్లిద్దరూ 2019 నుంచి డేటింగ్లో ఉన్నారు. అయితే.. రాహుల్- అథియా తమ రిలేషన్షిప్ విషయం ఎక్కడ బయటపడకుండా చూసుకున్నారు. 2021లో అథియా పుట్టిన రోజున రాహుల్ ఇన్స్టాలో ఆమెను విష్ చేస్తూ ఫొటో షేర్ చేశాడు. దాంతో, వాళ్లు ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికి తెలిసింది. ఆ తర్వాత రాహుల్, అథియా జంటగా పార్టీల్లో కనిపించారు. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి.