Michael Movie | మైఖేల్ ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి సందీప్ పాన్ ఇండియా లెవల్లో హిట్టు కొట్టెలా ఉన్నాడుగా..!
కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'బీరువా', 'ఏ1 ఎక్స్‌ప్రెస్' వంటి పలు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలే సాధించినా.. సందీప్‌కు మాత్రం స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టలేకపోయాయి.
Michael Movie Trailer | టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కమర్షియల్ హీరో గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి విభిన్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘బీరువా’, ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ వంటి పలు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలే సాధించినా.. సందీప్‌కు మాత్రం స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టలేకపోయాయి. ఈ క్రమంలో రెండేళ్లు గ్యాప్ తీసుకుని ‘మైఖేల్’ వంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రంజిత్ జయంకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమ ట్రైలర్ రిలీజైంది.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండిఉంది. అయితే ట్రైలర్లో ఎక్కువగా ఏమి రివీల్ చేయలేదు. కానీ హీరోయిన్ చుట్టూ ఈ సినిమా కథ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. మరి హీరోయిన్ ఎవరు? అసలు హీరోయిన్‌కు ఏమైంది? హీరోయిన్ కోసం సందీప్ గ్యాంగ్‌స్టార్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే పలు విషయాలను సస్పెన్స్‌లో పెట్టారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. గౌతమ్ మీనన్ ఇంటెన్వీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక వరుణ్ సందేష్ కొత్తగా కనిపిస్తున్నాడు. వరలక్ష్మీ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఒక్క ట్రైలర్‌తో ఎక్కడ లేని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఫీమేల్ క్యారెక్టర్లకు ఈ సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్లు ట్రైలర్‌తో స్పష్టమవుతుంది. లవ్ కమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ౩న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది. సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి,కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పుస్కుర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

