Sigma | తమిళనాడు సీఎం, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మొదటి సినిమా ‘సిగ్మా’ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జులై 31న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. సుబాస్కరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మైండ్ గేమ్ యాక్షన్ ఎంటర్టైనర్కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మనం కోల్పోయిన దాన్ని తిరిగి అదే స్థానంలో వెతుక్కోవడం, దానికోసం ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. కెనడాలోని టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ మరియు లండన్‌లో స్క్రీన్‌రైటింగ్ పూర్తి చేసిన జాసన్ సంజయ్, తన తండ్రి స్టార్ ఇమేజ్‌తో సంబంధం లేకుండా ఒక వైవిధ్యమైన కథాంశంతో మెగా ఫోన్ పట్టడం పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
A high-stakes heist begins. 💵 #SIGMA storms into theatres on July 31st. 🗓️ Gear up for the ultimate quest. 🔥@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @jsjmedia01 @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu… pic.twitter.com/Sd87kylWZN
— Lyca Productions (@LycaProductions) May 29, 2026