Tollywood Box Office | తెలుగు సినిమా ఊపిరి పీల్చుకో.. జూన్‌లో సినిమాల సందడి షురూ..
Tollywood Box Office | ఎట్టకేలకు ఈ వేసవి చివరి దశకు చేరుకుంది. నిజానికి ఈ వేసవి సినిమాలతో కళకళలాడుతుందని అంతా అనుకున్నారు. పెద్ది, ది ప్యారడైజ్, జన నాయగన్ వంటి భారీ సినిమాలన్నీ ఈ వేసవిలోనే సందడి చేస్తాయని భావించారు. పెద్ది, ది ప్యారడైజ్ సినిమాలకైతే మార్చి 27న విడుదల కానున్నట్టు డేట్లు కూడా ప్రకటించారు.
Tollywood Box Office | ఎట్టకేలకు ఈ వేసవి చివరి దశకు చేరుకుంది. నిజానికి ఈ వేసవి సినిమాలతో కళకళలాడుతుందని అంతా అనుకున్నారు. పెద్ది, ది ప్యారడైజ్, జన నాయగన్ వంటి భారీ సినిమాలన్నీ ఈ వేసవిలోనే సందడి చేస్తాయని భావించారు. పెద్ది, ది ప్యారడైజ్ సినిమాలకైతే మార్చి 27న విడుదల కానున్నట్టు డేట్లు కూడా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి షూటింగులు పూర్తి కాకపోవడం, మరోవైపు ఐపీఎల్ క్రికెట్.. ఇలా వివిధ కారణాల దృష్ట్యా రిలీజ్లు వాయిదా పడి, చివరకు వేసవి అంతా సరైన సినిమాల్లేక నిస్సారంగా మారింది. రెండు తెలుగురాష్ర్టాల్లో థియేటర్లన్నీ బోసిపోయాయి.
అయితే.. జూన్ 4న రాబోతున్న రామ్‌చరణ్ ‘పెద్ది’తో థియేటర్లలో మళ్లీ సందడి షురూ కానున్నది. ఇటీవల జగపతిబాబు ఈ విషయాన్నే పాత్రికేయుల సమావేశంలో ఊటంకించారు. ‘పెద్ది’తో తెలుగు సినిమా గట్టిగా ఊపిరి పీల్చుకోనున్నదని, ‘పెద్ది’ రాబోతున్న సినిమాలకు పెద్ద దిక్కు లాంటిదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం సగటు ప్రేక్షకుడు సైతం ‘పెద్ది’ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇదిలావుంటే.. జూన్‌లో ‘పెద్ది’తో పాటు ఇంకొన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా సమంత ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న ఈ సినిమా విడుదల కానున్నది. అయితే.. ఈ సినిమాకు తమిళ అగ్ర హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ‘జన నాయగన్’ నుంచి పోటీ తప్పేలా లేదు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో, జూన్ 19నే ‘జగ నాయగన్’ని విడుదల చేసేందుకు కేవీఎన్ ప్రొడక్షన్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అదే నిజమైతే.. విజయ్‌తో సమంత పోటీ పడాల్సివస్తుంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందిన ‘లెనిన్’ సినిమాను జూన్ 26న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. ఇక జూన్ నెలలో వస్తున్న చిన్న సినిమాల విషయానికొస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ నిర్మించిన ‘సింగ్ గీతం’. ఈ సినిమా జూన్ 11న విడుదల కానుంది. ఇక యువహీరో హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా రూపొందిన ‘దీవానా’ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. విజయ్, సమంత సినిమాల మధ్య ఈ చిన్న సినిమా ఏమాత్రం తట్టుకుంటుందో చూడాలి. మొత్తంగా జూన్ నెలంతా సినిమాలతో కళకళలాడనున్నది. రెండు తెలుగు రాష్ర్టాల థియేటర్లలో సందడి షురూ కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Box office
- Jana Nayagan
- Lenin
- peddi
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

