ఏడు రోజుల విహారం

ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘7డేస్ 6నైట్స్’. సుమంత్ అశ్విన్, మోహర్చావల్, రోహన్, క్రితికాశెట్టి నాయకానాయికలుగా నటిస్తున్నారు. సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మాతలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నా గత చిత్రం ‘డర్టీహరి’ మాదిరిగా సాగే కథ ఇదని చాలా మంది భావిస్తున్నారు. ఆ సినిమాతో ఏమాత్రం సంబంధంలేని చక్కటి కుటుంబ కథా చిత్రమిది. సినిమా ఆద్యంతం ఓ విహార యాత్ర అనుభూతిని కలిగిస్తుంది. దృశ్యపరంగా కూడా కన్నులపండువగా ఉంటుంది. ప్రతి సన్నివేశం సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంది. తొలిషెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 28నుంచి బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలలో చిత్రీకరణ జరుపుతాం’ అన్నారు. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని సుమంత్ అశ్విన్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, సంగీతం: సమర్థ్ గొల్లపూడి, సహనిర్మాతలు: జె.శ్రీనివాసరాజు, మంతెన రాము, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

