Suma Kanakala | గత నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ ఫుడ్ స్టాల్ నడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అప్పటివరకు సోషల్ మీడియా సెలబ్రిటీగా ఉన్న ఈమెను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా స్టార్‌ను చేసేశారు. ఇక కుమారి ఆంటీ చెప్పిన ”మీది మొత్తం 1000 అయ్యింది రెండు లివర్లు ఎక్స్ట్రా” అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ డైలాగ్‌ను నెటిజన్లు రీమిక్స్ చేసి వదిలారు. దీంతో మళ్లీ కుమారి ఆంటీ సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
అయితే టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల ప్రస్తుతం కుమారి ఆంటీలా మారిపోయింది. కుమారి ఆంటీ మాటలతో సుమ తాజాగా ఓ ఇన్‌స్టా రీల్ చేసింది. ఇక రీమిక్స్ సాంగ్‌తో ఉన్న ఈ రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీని కూడా ఈ రీల్లో మిక్స్ చేస్తూ మాష్ అప్ వీడియో చేసింది సుమ.