తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ(Suma). ఇప్పటికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్కడ నవ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు.
సుమ మాతృభాష మలయాళం అయినప్పటికీ.. తెలుగు స్పష్టంగా పలుకుతుంది. సుమ ఉందంటే ఆ షో ఫుల్ సక్సెస్ అయినట్టే. రీసెంట్గా బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss)లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌కి గెస్ట్‌గా వచ్చిన సుమ హౌజ్‌లో ఉన్నంత సేపు కంటెస్టెంట్స్‌తో కలిసి రచ్చ చేసింది. ఆమె యాంకరింగ్‌తో వేడుక కళే మారిపోతోంది. వల్గారిటీ ఉండదు.. అందరితో ఈజీగా కలిసిపోతోంది.
ఓ పక్క యాంకర్లుగా రాణిస్తున్న అందాల భామలు సినిమాల్లో సత్తా చాటుతున్నారు.సుమ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఓ వీడియో ద్వారా సుమ ఈ విషయాన్ని తన స్టైల్లో చెప్పేశారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పేర్కొన్నారు. మరి ఏ సినిమాతో సుమ ఎంట్రీ ఇవ్వనుందనే తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.