నా దృష్టిలో వినోదమే సందేశం
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి సుకృతికి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం.
యాక్టింగ్ మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపలేదు. నా ముందు గారాలు పోయే సుకృతి ఎలా యాక్ట్ చేస్తుందో అనే చిన్న సందేహం ఉండేది. కానీ ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది. దర్శకురాలు కథ ఎంత గొప్పగా రాసుకుందో అంతే గొప్పగా సినిమా తీసింది. మనుషుల్ని మూడు గంటలు కూర్చొబెట్టి ఎంటర్టైన్ చేస్తే ప్రపంచంలో ఆ మూడు గంటలు క్రైమ్ తగ్గుతుందని నేను నమ్ముతాను. నా దృష్టిలో ఎంటర్టైన్మెంటే సందేశం. ‘ఆర్ట్‌ని బిజినెస్‌గా చేసుకుంటేనే సినిమాల్లోకి వెళ్లు.
మనుషులు ఆనందం కోసమే బతుకుతారు. ఆనందాన్నిచ్చే ఎంటర్టైన్మెంటే నీ సందేశం అనుకో’ అని సినిమాల్లోకి వచ్చే ముందు మా గురువుగారు చెప్పిన మాటలతో బాగా రియలైజ్ అయ్యాను. వినోదంతో పాటు సందేశం ఉంటే అది సినిమాకు బోనస్. గాంధీ తాత చెట్టు అదే కోవకు చెందుతుంది’ అన్నారు. చెట్టుకి, మనిషికి మధ్య ప్రేమకథ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే కథ పుట్టిందని దర్శకురాలు చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఆదరించాలని నిర్మాతలు నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

