గాంధీ బాటలో ఊరి కోసం
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను అగ్ర నటుడు మహేష్‌బాబు సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. అందరి మనసులకు హత్తుకునే సినిమా ఇదని, సుకృతివేణితో పాటు టీమ్ అందరికి అభినందనలు అంటూ మహేష్‌బాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ఆయన బాటలో నడిచే ఓ పాఠశాల విద్యార్థిని తన తాతకు ఇష్టమైన చెట్టును, ఊరిని ఎలా రక్షించుకుందనే సందేశాత్మక ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతున్నది. ప్రపంచమంతటా అసూయద్వేషాలు పెరిగి పోయిన ప్రస్తుత తరుణంలో గాంధీజీ సిద్ధాంతాలను పాటించే ఓ పదమూడేళ్ల అమ్మాయి కథగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని దర్శకురాలు పద్మావతి మల్లాది పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీజిత్ చెర్వుపల్లి, సంగీతం: రీ, రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

