స్టార్ హీరోతో నటించే చాన్స్ మిస్ చేసుకున్న అనుపమ.. ఈ కేరళ కుట్టి అదృష్టాన్ని సమంత తన్నుకుపోయింది..!
తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో నటీనటుల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఒకరితో అనుకున్న కథ మరొకరి చెంతకు వెళ్తుంది.
Anupama Parameshwaran | తినే ప్రతి బియ్యపుగింజ మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో నటీనటుల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. ఒకరితో అనుకున్న కథ మరొకరి చెంతకు వెళ్తుంది. సినిమా పోతే అబ్బ చేయకపోవడమే మంచిదైంది అని అనుకుంటారు. ఒక వేళ బ్లాక్బస్టర్ హిట్టయితే, వాళ్ళ భాద అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు అదే విషయం అనుపమ పరమేశ్వరణ్ విషయంలో జరిగింది. ప్రస్తుతం అనుపమ నటించిన ’18పేజీస్’ రిలీజ్కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కాగా ఈ వేడుకలో దర్శకుడు సుకుమార్ అనుపమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. అనుపమ మంచి నటి, తనకు తెలుగు కూడా బాగా వచ్చు. ఇది అనుపమకు ఉన్న మరో అదనపు క్వాలిటీ అన్నాడు. అంతేకాకుండా ‘రంగస్థలం’ సినిమాలో సమంత కంటే ముందు అనుపమనే అనుకున్నారట. ఆడిషన్ కూడా చేశారట. కానీ ఆడిషన్ టైమ్లో అనుపమ భయంతో వాళ్ళ అమ్మ వైపు చూసింది. అందుకే నాకు భయమేసి సమంతను పెట్టుకున్నా అని చెప్పాడు. ఇక రామలక్ష్మీగా సమంత నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు బాధగా ఉంటుందని అనుపమ చెప్పింది. ఒకవేళ రంగస్థలం మూవీ అనుపమ చేసుంటే ఆమె కెరీర్ పీక్లో ఉండేది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడపుతుండేది. ప్రస్తుతం ఈ అమ్మడుకి కేవలం మీడియం రేంజ్ సినిమాల ఆఫర్స్ మాత్రమే వస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

