OG Movie | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ (OG). రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ దర్శకుడు సుజీత్ ఒక క్రేజీ పోస్ట్ పెట్టాడు.
సుజీత్ తన ఇన్స్టాగ్రామ్ డీపీ మారుస్తూ.. ఒక సాలిడ్ ఫొటో పెట్టాడు. ఇందులో సుజీత్‌పై ఓజీ (పవన్ కల్యాణ్) చేతులు వేసినట్లు ఫొటో ఉంది. దీంతో ఈ ఫొటోను మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
Sujeeth Latest Instagram DP 🔥🔥
Two Hungry Cheetahs in single frame #OG 🦁🦁 pic.twitter.com/gveKQ8vsPW
— Pawanism™ (@santhu_msd7) February 16, 2024