సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుధీర్ జోకర్’. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ అయేషా కథానాయికగా పరిచయమవుతున్నది. సోమవారం సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్ ప్లేయింగ్ కార్డ్స్‌ను పట్టుకొని కనిపిస్తున్నారు.
ఇది మైండ్‌గేమ్ ప్రధానంగా సాగే వినోదాత్మక చిత్రమని, సుడిగాలి సుధీర్ పాత్ర నవ్యరీతిలో సాగుతుందని మేకర్స్ తెలిపారు. అభిరామి, మురళీశర్మ, అజయ్‌ఘోష్, రమేష్ ఇందిరా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అహ్మద్ షరీఫ్, సంగీతం: లియోన్ జేమ్స్, ప్రొడక్షన్ డిజైనర్: విఠల్ కోసనం, రచన-దర్శకత్వం: పీఎస్ సునీల్ పుప్పాల.