సుడిగాలి సుధీర్‌గా పేరుపొందిన సుధీర్ ఆనంద్ కథానాయకుడిగా రూపొందుతున్న ఎమోషనల్ డ్రామా ‘హైలెస్సో’. ప్రసన్నకుమార్ కోట దర్శకుడు. శివ చెర్రీ, రవికిరణ్ నిర్మాతలు. ప్రముఖ నటుడు శివాజీ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటం విశేషం. మంగళవారం సుధీర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
రఫ్ లుక్‌లో, గంటలు కట్టిన ఖడ్గాన్ని చేతపట్టుకొని రక్తపు మరకలతో పవర్ఫుల్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న సుడిగాలి సుధీర్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని, సుధీర్ ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిభిన్నమైన పాత్రను ఇందులో పోషిస్తున్నారని, ఇప్పటికే హైదరాబాద్‌లో 25రోజుల షెడ్యూల్ పూర్తయిందని, త్వరలోనే ఏలూరులో 40రోజల భారీ షెడ్యూల్ ప్రారంభం కానున్నదని మేకర్స్ తెలిపారు.
నటాషా సింగ్, నక్షా సరన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తు న్నది. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, నిర్మాణం: వజ్ర వరాహి. సినిమాస్.