Sudigali Sudheer | సైకలాజికల్ థ్రిల్లర్‌గా సుధీర్ సినిమా.. ఆకట్టుకుంటున్న ‘కాలింగ్ సహస్ర’ టీజర్
'జబర్దస్త్' షోతో బుల్లితెరకు పరిచయమై హీరోగా, కామెడియన్‌గా, యాంకర్‌గా, సింగర్‌గా ఇలా పలువిభాగాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్.
Sudigali Sudheer | ‘జబర్దస్త్’ షోతో బుల్లితెరకు పరిచయమై హీరోగా, కామెడియన్‌గా, యాంకర్‌గా, సింగర్‌గా ఇలా పలువిభాగాల్లో తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాలింగ్ సహస్ర’. అరుణ్ వక్కిరాల దర్శకత్వం వహించాడు. ఇది వరకే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ క్రమంలో చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘బ్రతకడం కోసం చంపడం సృష్టి ధర్మం.. మరి చంపడం కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది’ అంటూ మొదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ‘ఇప్పటివరకు వాళ్ళు 6000 మందిన చంపారు’ అని శివ బాలాజి మాటలు ఆ సైకోలు ఎంత కిరాతకులో అర్థమవుతుంది. సైబర్ సెక్యూరిటి ప్రొఫెషనల్‌గా సుధీర్ ఆకట్టుకుంటున్నాడు. ఫైట్స్ సీన్లను కూడా సుధీర్ అద్భుతంగా చేశాడు. టీజర్ భయానకంగా ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్‌గా జోడిగా డాలీషా హీరోయిన్గా నటించింది. శివ బాలాజీ కీలకపాత్రలో నటించాడు. విజేష్ తాయల్, కటూరి వెంకటేశ్వరులు, పామిడి చిరంజీవి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

