టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు (sudheerbabu) నటిస్తోన్న తాజా చిత్రం హంట్ (Hunt). మహేశ్ సూరపనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే స్టన్నింగ్ అప్డేట్ అందించాడు సుధీర్ బాబు. ఈ సినిమా కోసం పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ రెనౌడ్-బ్రియాన్ అదిరిపోయే స్టంట్స్ డిజైన్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న హంట్ సినిమా కోసం ఎలాంటి రిస్కీ అండ్ స్టైలిష్ స్టంట్స్ చేశారో తెలియజేస్తూ సుధీర్ బాబు అండ్ మేకర్స్ టీం ఓ వీడియో షేర్ చేసింది.
ఈ స్టంట్స్ మేకింగ్ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రెనౌడ్-బ్రియాన్ పర్యవేక్షణలో షూట్ చేసిన స్టన్నింగ్ యాక్షన్ సీన్లు ఈ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నాయని తాజా వీడియో చెబుతోంది. హంట్ చిత్రంలో భరత్ నివాస్, శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు . భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరుళ్ విన్సెంట్ హంట్ చిత్రానికి పనిచేస్తున్నాడు. సుధీర్‌బాబు దీంతోపాటు సెహరీ ఫేం జ్ఞానసాగర్ దర్శకత్వంలో హరోం హర సినిమా కూడా చేస్తున్నాడు. అదేవిధంగా మామా మచ్చింద్ర, పుల్లెల గోపిచంద్ బయోపిక్ ప్రాజెక్ట్ లను కూడా లైన్లో పెట్టాడు సుధీర్ బాబు.
సుధీర్ బాబు స్టంట్స్ మేకింగ్ వీడియో..
#HuntTheMovie stunt making promo is here🔥
Full video launch by Handsome Hunk @RanaDaggubati tomorrow at 10.01 AM 💥#HuntFrom26Jan
Nitro Star @isudheerbabu @bharathhere @actorsrikanth @Imaheshh @ChitraShuklaOff #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @PulagamOfficial pic.twitter.com/U2SaFoyHTj— BA Raju's Team (@baraju_SuperHit) January 8, 2023