G.O.A.T | సుడిగాలి సుధీర్ ‘గోట్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
G.O.A.T | ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) Greatest Of All Times అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత.
G.O.A.T | ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T (గోట్) Greatest Of All Times అనేది ఉపశీర్షిక. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత. ప్రస్తుతం చిత్రం చిత్రీకరణ దశలో వుంది. కాగా ఇటీవల ఈచిత్రం నుంచి విడుదలైన అయ్యో పాపం సారూ.. అనే ఓ బ్యూటిఫుల్ లిరికల్ వీడియో చార్ట్‌బస్టర్‌గా నిలిచి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌గా.. హీరో క్యారెక్టర్ గురించి చెప్పే ‘బాసే హే నీలా వుండే లక్కు మాకే లేదురా.. సెలబ్రిటీ నీకన్న ఎవడురా’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించారు. హీరో సుధీర్‌పై చిత్రీకరించిన ఈ పాటను ఇటీవల పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ పుష్ప-2లోని టైటిల్ సాంగ్‌ని పాడి పాపులరైన దీపక్ బ్లూ ఈ పాటను ఆలపించడం విశేషం. కొరియోగ్రాఫర్ జీతు మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ మూమెంట్స్‌ను అందించారు. వినసొంపైన బాణీలతో, క్యాచీ పదాలతో అందర్ని ఆకట్టుకునే విధంగా వుంది.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. టాకీ పార్ట్ దాదాపు పూర్తిచేసుకున్నాం. యాక్షన్ ఏపిసోడ్స్, రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది. త్వరలో వాటిని కూడా చిత్రీకరిస్తాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, డీఓపీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: కె.విజయవర్ధన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి, కో ప్రొడ్యూసర్: రవీంద్ర రెడ్డి.ఎన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ, రైటర్: ఫణిక్రిష్ణ సిరికిరి, ప్రొడక్షన్ కంట్రోలర్: వీఎన్ రావు, ఫైట్స్: రాబిన్‌సుబ్బు.
Also read..
- Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. ప్రహరీ గోడ కూలి చిన్నారి మృతి
- Imanvi Esmail | ప్రభాస్‌కు జోడీగా రీల్ గర్ల్ ఇమాన్వి ఇస్మాయిల్ వైరల్ అవుతున్న ఫొటోలు
- RTC bus | అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఒకరికి గాయాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

