Hunt Movie | హంట్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్.. యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయిగా..!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి.
Hunt Movie Making Video | టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా కూడా మొదట పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఫుల్ రన్లో బ్రేక్ ఈవెన్‌ను సాధించలేకపోయింది. దాంతో సుధీర్ ఈ సారి పూర్తి స్థాయి యాక్షన్ మోడ్‌లో ‘హంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
మహేష్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సుధీర్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతుందట. ఇప్పటికే చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.
మేకింగ్ వీడియోలో సుధీర్ బాబు ఈ సినిమా కోసం బాగా కష్టపడినట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కోసం సుధీర్ బాబు ఏ మేర ప్రాక్టీస్ చేశాడో తెలుస్తుంది. పలు హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రాఫి చేసిన రేనాడ్ బ్రయాన్ ఈ సినిమాకు స్టంట్స్‌ను కంపోజ్ చేశాడు. శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. జిబ్రాన్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

