సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మామా మశ్చీంద్ర’. ఈ చిత్రానికి హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. సృష్టి సెల్యూలాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు దుర్గా, పరశురామ్, డీజే అనే మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం దుర్గా క్యారెక్టర్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పాత్రలో సుధీర్ బాబు తన రెగ్యులర్ లుక్కు భిన్నంగా కనిపిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : చైతన్ భరద్వాజ్.