Sudheer babu | సుధీర్ బాబు నిజాయితీని మెచ్చుకోవాల్సిందే
Sudheer babu | కొత్త కథలు, పాత్రలు ప్రయత్నిస్తారనే పేరు సుధీర్ బాబు (Sudheer babu)కి వుంది. తెలుగులో హీరోగా చేస్తూనే బాలీవుడ్ సినిమా బాగీ (Baaghi) లో విలన్ గా చేశారు. అలాగే కృష్ణమ్మ కలిపింది, భలే మంచి రోజు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని విలక్షణత చాటాయి.
Sudheer babu | కొత్త కథలు, పాత్రలు ప్రయత్నిస్తారనే పేరు సుధీర్ బాబు (Sudheer babu)కి వుంది. తెలుగులో హీరోగా చేస్తూనే బాలీవుడ్ సినిమా బాగీ (Baaghi) లో విలన్ గా చేశారు. అలాగే కృష్ణమ్మ కలిపింది, భలే మంచి రోజు లాంటి చిత్రాలు కూడా ఆయనలోని విలక్షణత చాటాయి. అయితే ఇటివలే సుధీర్ బాబు ‘హంట్'(Hunt) అనే సినిమా చేశారు. నిజానికి చాలా రిస్క్ తీసుకొని చేసిన చిత్రమిది. సాధారణంగా అలాంటి పాత్ర చేయడానికి హీరోలు ఆసక్తి చూపించరు. కానీ సుధీర్ బాబు ఆ ఛాలెంజ్ ని తీసుకున్నారు. అయితే సినిమా ఫలితం నిరాశపరిచింది. ఈ సినిమా పై చాలా నిజాయితీగా వాస్తవాన్ని ఒప్పుకున్నారు సుధీర్ బాబు.
హంట్ సినిమా విషయంలో సుధీర్ బాబు చేసుకున్న విశ్లేషణ బావుంది.” హంట్ నాకో ప్రత్యేకమైన సినిమా అవుతుందని భావించాను. కానీ అది ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సినిమా విషయంలో నా జడ్జ్మెంట్ తప్పు. కొత్తదనం ఇచ్చే ప్రయత్నం మంచిదే. కానీ మనం ఇచ్చే కొత్తదనం ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో హంట్ సినిమా నాకు మంచిపాఠం నేర్పింది. ఇకపై చేసే చిత్రాలలో కొత్తదనంతో పాటు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు చేయడానికి ప్రయత్నిస్తాను”అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.
ఇక సుధీర్‌బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’(Mama mascheendra). అమృతం ఫేమ్ రచయిత హర్షవర్దన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సునీల్ నారంగ్, పున్కూర్ రామ్మోహన్రావు నిర్మాతలు. అక్టోబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

