Sudheer Babu | ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!
Aa Ammayi Gurinchi Meeku Cheppali Release Date Announced | హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు. గతంలో రొటీన్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో తన రూట్ మార్చుకున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రం తర్వాత సుధీర్ కథల ఎంపిక పూర్తిగా మారింది. ‘వి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి వినూత్న కథలను ఎంచుకుంటున్నాడు. కమర్షియల్‌గా ఈ రెండు చిత్రాలు అంతగా సక్సెస్ కాకపోయినా సుధీర్‌కు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈయన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మేకర్స్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కానున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో కృతిశెట్టి పరిగెడుత్తుతుంది. కృతితో పాటే సుధీర్ బాబు మైక్ పట్టుకుని పరిగెడుతున్నాడు. పోస్టర్‌ను చూస్తుంటే ఈ సినిమాలో సుధీర్‌బాబు ఓ సీన్‌ను దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్లు గమనిస్తే ఈ మూవీలో సుధీర్ దర్శకుడిగా నటించినట్లు కన్ఫార్మ్ అయింది. ఇక ఈ చిత్రం సుధీర్‌బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రాహుల్ రామకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
అనగనగా ఒక అమ్మాయి ☺ ….
మిగితా కథ, మా ఇద్దరి కథ ♥️ … ఈ అబ్బాయి సెప్టెంబరు 16న చెబుతాడు #AAGMC in theatres from September 16th.#AAGMConSEP16#AaAmmayiGurinchiMeekuCheppali @IamKrithiShetty #MohanaKrishnaIndraganti @oddphysce@mahendra7997 @MythriOfficial pic.twitter.com/4dou61Qhxl— Sudheer Babu (@isudheerbabu) August 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

