Sudha Kongara | ఆకాశం నీ హద్దురా దర్శకురాలికి తీవ్ర గాయాలు.. బాధగా ఉందంటూ పోస్ట్..!
'ఆకాశం నీ హద్దురా' సినిమాతో జాతియ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది దర్శకురాలు సుధా కొంగర. తాజాగా ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని స్వయంగా సుధా కొంగర సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
Sudha Kongara | ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది దర్శకురాలు సుధా కొంగర. తాజాగా ఆమె తీవ్ర గాయాలపాలైంది. ఈ విషయాన్ని స్వయంగా సుధా కొంగర సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఎడమ చేతికి ఫ్యాక్చర్ అయినట్లు ఫోటోను షేర్ చేసింది. ‘చాలా బాధగా ఉంది. ఎంతో చిరాకుగా ఉంది. నెల రోజుల పాటు షూటింగ్‌కు బ్రేక్ తప్పదు’ అంటూ పోస్ట్ పెట్టింది. దీనిపై సంగీత దర్శకుడు జీ.వి ప్రకాష్ కుమార్ ‘త్వరలోనే కోలుకుంటారు సిస్టర్’ అంటూ కామెంట్ చేశాడు. ఇలా సుధా కొంగర గాయపడిన ఫోటోలు షేర్ చేయడంతో పలువురు నెటీజన్లు మీరు చాలా స్ట్రాంగ్ ఉమెన్.. త్వరగా కోలుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సుధా కొంగర ఆకాశం నీ హద్దురా సినిమాను హిందీలో అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేస్తుంది. ఇప్పటికే సగం వరకు షూటింగ్ కూడా పూర్తయింది. రాధిక మదన్ హీరోయిన్గా నటిస్తుంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య, జ్యోతికలు నిర్మిస్తున్నారు. విక్రమ్ మల్హోత్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రెండేళ్ల క్రీతం కరోనా కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇండియా నుంచి ఈ సినిమాను అధికారకంగా ఆస్కార్‌కు పంపించారు. కానీ ఆస్కార్ నామినేషన్లో అవకాశం దక్కలేదు.
Super painful. Super annoying! On a break for a month 😒 #NotTheKindOfBreakIWanted pic.twitter.com/AHVR4Nfumf
— Sudha Kongara (@Sudha_Kongara) February 5, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

