జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించిన కన్నడ స్టార్ హీరో

ప్రస్తుతం మన సినిమాలే కాదు ఇక్కడి హీరోలు కూడా ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులకు,సెలబ్రిటీలకు తెగ నచ్చేస్తున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్‌పై కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించగా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని ఆకాశానికి ఎత్తారు సుదీప్. ఒక ఇంటర్వ్యూలో తనకు టాలీవుడ్ హీరోలో అత్యధికంగా నచ్చే హీరో ఎన్టీఆర్ అన్నాడు.
ఎన్టీఆర్ పడే కష్టం నాకు బాగా నచ్చుతుంది. ఆయనతో కలిసి వర్క్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఆయన అద్బుతంగా నటిస్తాడు. ఎన్టీఆర్‌తో నటించడం మిగతా వారికి ఛాలెంజింగ్‌గా ఉంటుంది. భీమ్ పాత్ర కోసం అతడు మారిన తీరు అద్బుతం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. చబ్బీ చబ్బీ గా ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు అద్బుతమైన ఫిజిక్ తో భీమ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
చబ్బీగా ఉండే ఎన్టీఆర్ ఇప్పుడు అద్భుతమైన ఫిజిక్‌తో భీమ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కొమురం భీంగా అందరిని అలరిస్తాడు అంటూ సుదీప్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ క్లిప్ ను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గురించి గతంలో పలువురు స్టార్స్ వ్యాఖ్యలు చేసినా.. ఈసారి ఎన్టీఆర్ గురించి సుదీప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండగా, ఇది పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు ఎవరు మీలో కోటీశ్వరులు షో తో ప్రేక్షకులమ ఉందుకు రాబోతున్నాడు. ఆగస్ట్ నుండి ఈ షో ప్రారంభం కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- kicha sudeep
- rrrr
- sudeep
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

