Vikrant Rona Movie | ఓటీటీలోకి ‘విక్రాంత్ రోన’ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vikrant Rona Movie On OTT | ‘విక్రాంత్ రోన’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కిచ్చా సుదీప్. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28న విడుదలై ఘన విజయం సాధించింది. సుదీప్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతేకాకుండా విడుదలైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధించి డబుల్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో ఇండియాని షేక్ చేసిన కన్నడ సినిమాగా ‘విక్రాంత్ రోన’ నిలిచింది. దాదాపు రూ.95కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనల్‌గా రూ.250 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. ఇక ఇటీవలే ఈ చిత్రం కన్నడ వెర్షన్ ఓటీటీలో విడుదలవగా.. మంచి వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతుంది.
కాగా తెలుగు వెర్షన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 16 నుండి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది. ఈ చిత్రాన్ని షాలినీ ఆర్ట్స్, ఇన్వెనియో ఒరిజిన్ సంస్థలతో కలిసి సుదీప్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈ చిత్రంలో నిరూప్ భండారి, నీతా అశోక్ కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రత్యేక గీతంలో అలరించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

