Subhalekha Sudhakar: నటుడు శుభలేఖ సుధాకర్ ఇంట్లో విషాదం

ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, ప్రముఖ గాయకురాలు ఎస్పీ శైలజ అత్త ఎస్ఎస్ కాంతం(80) మంగళవారం చెన్నైలో కన్నుమూసారు. మూడు నెలల క్రితం గుండెపోటుకు గురైన కాంతం.. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు.
చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్ఎస్ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. ఇప్పుడు ఆయన తల్లి కూడా చనిపోవడం విషాదాన్ని కలిగిస్తుంది. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు కాగా సుధాకర్ పెద్దవారు. రెండో కుమారుడు మురళీ దత్తుపోయి వైజాగ్లో, మూడో కుమారుడు సాగర్ అట్లాంటాలో స్థిరపడ్డారు.
కాంతం అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నాం జరగనున్నాయి. సుధాకర్ తల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, శుభలేఖ సుధాకర్ అసలు పేరు సూరావజ్జల సుధాకర్. ‘శుభలేఖ’ చిత్రంలో నటించి ఆ తర్వాత ఆయన ఆ పేరుతోనే సుపరిచితుడయ్యాడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

