Bandla Ganesh | బండ్ల గణేష్ ఇంట్లో స్టార్ స్టడెడ్ గెట్ టూ గెదర్..30 ఏళ్ల ఇండస్ట్రీ స్నేహ బంధం
Bandla Ganesh | టాలీవుడ్లో ఒకప్పుడు హిట్లు అందించిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ తన సినీ మిత్రులతో కలిసి సందడి చేస్తుంటారు. తాజాగా ఆయన ఇంట్లో జరిగిన ప్రత్యేక పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలు ప్రముఖులు హాజరై సందడి చేశారు.
Bandla Ganesh | టాలీవుడ్లో ఒకప్పుడు హిట్లు అందించిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలకు కొంత దూరంగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ తన సినీ మిత్రులతో కలిసి సందడి చేస్తుంటారు. తాజాగా ఆయన ఇంట్లో జరిగిన ప్రత్యేక పార్టీకి టాలీవుడ్‌కు చెందిన పలు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఆలీ, శ్రీకాంత్, బ్రహ్మాజీ, శివాజీ రాజా, కృష్ణవంశీ, కె. రాఘవేంద్రరావు, బీవీఎస్ రవి, రాజా రవీంద్ర, శివాజీ వంటి పేరొందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటుడు బ్రహ్మాజీ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ, “30 ఇయర్స్ ఇండస్ట్రీ. పార్టీకి థ్యాంక్యూ బండ్ల గణేష్ బ్రో. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్‌తో… సీనియర్ సిటిజన్స్… కాదు కాదు, సీనియర్ యాక్టర్స్ ” అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.
ఇప్పుడు ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరలవుతున్నాయి. నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్లు, మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి.ఇటీవల కాలంలో పాత తరం హీరోలు, దర్శకులు తరచూ రీ యూనియన్ పేరుతో కలుస్తూ అభిమానులని తెగ అలరిస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ ఇంట్లో జరిగిన ఈ గెట్ టుగెదర్ కూడా అలాంటి వాతావరణాన్నే తలపించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అందరూ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసినవారే.
ఇదే తరహాలో ఇటీవల గోవాలో గ్లామరస్ రీ యూనియన్ పార్టీ జరిగింది. ఈ వేడుకలో మహేశ్వరి, సంఘవి, కావ్య రమేష్, సంగీత, సిమ్రన్, శ్వేత కొన్నూర్ మీనన్, ఊహ, శివ రంజని, డైరెక్టర్స్ కేఎస్ రవికుమార్, శంకర్, లింగుసామి, మోహన్ రాజా, ప్రభుదేవా, శ్రీకాంత్, జగపతి బాబు తదితరులు పాల్గొన్నారు.అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. మరోవైపు 90లలో అదరగొట్టిన హీరో, హీరోయిన్స్ కూడా అప్పుడప్పుడు ఇలా రీయూనియన్ పార్టీలు జరుపుకుంటూ సందడి చేస్తుంటారు. ఈ రీ యూనియన్లు టాలీవుడ్లో స్నేహబంధాలకు ప్రతీకలుగా మారుతున్నాయి.
30 years industry 😀❤️.. Thank you @ganeshbandla bro for hosting 🤗…
young n dynamic directors with senior citizens .. typo error… senior actors 😜 pic.twitter.com/TrS4NCScee— Brahmaji (@actorbrahmaji) August 24, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

