Stand Up Rahul | ‘లైఫ్‌లో సెట్టవ్వడం నీ బ్లడ్‌లోనే లేదు’.. ఆకట్టుకుంటున్న స్టాండ్ అప్ రాహుల్ ట్రైలర్
య్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యట్రిక్ సాధించిన రాజ్ తరుణ్ ఆ తరువాత ఇప్పటివరకు మరోక హిట్ సాధించలేదు.
Stand Up Rahul trailer | ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యట్రిక్ సాధించిన రాజ్ తరుణ్ ఆ తరువాత ఇప్పటివరకు మరోక హిట్ సాధించలేదు. మొదట్లో రాజ్‌తరుణ్ క్రేజ్ విపరీతంగా ఉండేది. ఆ తరువాత ఈయన గ్రాఫ్ కొద్ది కొద్దిగా తగ్గూతూ వచ్చింది. ఈయన కథల ఎంపిక విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడంతో వరుసాగా ఫ్లాప్స్‌ను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘స్టాండ్ అప్ రాహుల్’. శాంటో మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేం వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం టైటిల్‌నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు టీజర్ సినిమాపైన మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘వీడి వెటకారంతో సంవత్సరంలో మూడు ఉద్యోగాలు వెలగబెట్టాడు’. ‘జనాల్నీ నవ్వించడం ఇట్స్ ఎన్ ఆర్ట్..ఏడ్పించేవాళ్లకి అదేం అర్థమువుతుంది’. అంటూ వచ్చే డైలాగ్స్ హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఐఆమ్ ఏ డ్రీమర్ సర్.. కల్లు మూసి కనే కలల్నీ, కళ్ళ ముందే క్రియేట్ చేసుకోవడానికి విఆర్ ఇజ్ ద బెస్ట్ టూల్’ అంటూ వర్ష డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘అంకుల్ మీకు లివింగ్ అంటే తెలుసా చిన్నప్పుడు అమ్మనాన్న ఆట ఆడేవాళ్లం కదా అదే పెద్దయ్యాక ఆడితే లివింగ్’ అని రాజ్ తరుణ్ చెప్పే సంభాషణలు తనేంత చిలిపి క్యారెక్టర్ చేస్తున్నాడో తెలుస్తుంది. ‘ఏలాంటి సిచ్యువేషన్లో నైనా పెళ్ళి కలిసి ఉంటామనే నమ్మకాన్నిస్తుంది’. ‘నీతో 10 మినిట్స్ మాట్లాడితే ఏ అమ్మాయికన్నా అర్థమవుతుంది నువ్ మ్యారెజ్ మెటీరియల్ కాదని’ అనే డైలాగ్స్ రాజ్ తరుణ్ పాత్రను డిసైడ్ చేస్తున్నాయి ‘నీ డెసీషన్సే నీ వ్యూచర్ రాహుల్ స్టాండప్’. ‘లైఫ్‌లో సెట్టవ్వడం నీ బ్లడ్‌లోనే లేదు’ అంటూ చివర్లో వచ్చే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

