Mahesh-Trivikram Movie | SSMB28 మూవీ షూటింగ్ వీడియో లీక్
SSMB28 Movie | 'అల వైకుంఠపురం'లో తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మహేష్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
SSMB28 Movie | ‘అల వైకుంఠపురం’లో తర్వాత త్రివిక్రమ్ దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని మహేష్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కలయికలో తెరకెక్కుతున్న మూడో సినమా కావడంతో అటు మహేష్ అభిమానులు ఇటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. సిగరెట్ కాల్చూతూ నడుచుకుంటూ వస్తున్న స్టిల్ మహేష్ అభిమనులను ఖుషీ చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఓ చిన్న వీడియో క్లిప్ లీకైంది.
ఆ వీడియోలో మహేష్ సిగరెట్ కాల్చుతూ కారులో నుంచి దిగి ముందుకు వెళ్తున్నాడు. ఫస్ట్‌లుక్ పోస్టర్ చిత్రీకరణకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చాలా కాలం తర్వాత మహేష్ స్వాగ్, యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నట్లు వీడియో చూస్తే స్పష్టమౌవుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అమరావతికి అటు ఇటు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
#SSMB28 #leaked
🔥🔥🔥🔥🔥 pic.twitter.com/maiN7h7kMh— immortal (@Aakash67169863) March 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

